హైదరాబాద్ జూపార్క్‌లో కలకలం... సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు యువకుడి యత్నం

ABN , First Publish Date - 2021-11-23T23:57:20+05:30 IST

జూపార్క్‌లో కలకలం రేగింది. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. గమనించిన జూ సిబ్బంది వెంటనే యువకుడి అడ్డుకున్నారు. ఎర్రగడ్డకు...

హైదరాబాద్ జూపార్క్‌లో కలకలం... సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు యువకుడి యత్నం

హైదరాబాద్: జూపార్క్‌లో కలకలం రేగింది. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. గమనించిన జూ సిబ్బంది వెంటనే యువకుడిని అడ్డుకున్నారు. ఎర్రగడ్డకు చెందిన సాయి కుమార్ హోటల్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నట్లు జూ సిబ్బంది గుర్తించారు. అయితే సాయికుమార్ మానసిక పరిస్థితి సరిగాలేదని చెప్పారు. బహదూర్‌పురా పోలీసులకు యువకుడిని అప్పగించారు. జూ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-23T23:57:20+05:30 IST