Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదివారం Tank Bund మీదుగా వెళ్తున్నారా.. కండిషన్స్ అప్లై.. ఈ రూట్‌లో వెళ్లండి!

హైదరాబాద్‌ సిటీ : అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను వీకెండ్‌ పిక్నిక్‌ స్పాట్‌గా మార్చనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.


- లిబర్టీ నుంచి అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పైకి వాహనాలను అనుమతించరు. వారిని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ఇక్బాల్‌ మినార్‌ వైపునకు పంపుతారు.

- తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌ బండ్‌పైకి అనుమతించరు. వారిని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి లిబర్టీ, హిమాయత్‌నగర్‌ వైపునకు పంపుతారు.

- కర్బలా మైదాన్‌ నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్‌ క్లబ్‌ మీదుగా కవాడిగూడ, డీబీఆర్‌ మిల్స్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ గుడి, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపునకు పంపుతారు.

- డీబీఆర్‌ మిల్స్‌ నుంచి వచ్చే వాహనాలను గోశాల, కవాడిగూడ, జబ్బార్‌ కాంప్లెక్స్‌, బైబిల్‌ హౌస్‌ల వైపునకు పంపుతారు.

- ఇక్బాల్‌ మినార్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపునకు వెళ్లే వాహనాలను పాత సెక్రటేరియట్‌ వద్ద తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పైనుంచి అనుమతిస్తారు.


వాహనాల పార్కింగ్‌...

- ట్యాంక్‌బండ్‌ రోడ్‌పై ఇరువైపులా 200 మీటర్ల దూరం వరకు  పార్కింగ్‌.

- అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌పై లేపాక్షి వరకు.. 

- డాక్టర్‌ కార్స్‌ ప్రాంగణంలో

- న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, ఆదర్శనగర్‌. ఏపీ సెక్రటేరియట్‌ వద్ద

- సెయిలింగ్‌ క్లబ్‌  నుంచి చిల్డ్రన్‌ పార్క్‌ వరకు

- బుద్ద భవన్‌ వెనక నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు

- ఎన్‌టీఆర్‌ గ్రౌండ్స్‌ వద్ద సందర్శకుల వాహనాలకు పార్కింగ్‌ కేటాయించారు.

Advertisement
Advertisement