హైదరాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-06-16T17:01:04+05:30 IST

ప్రస్తుతమున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌-తిరుపతి మధ్య (వయా గుత్తి) ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం

హైదరాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

గుంతకల్లు, జూన్‌ 15: ప్రస్తుతమున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌-తిరుపతి మధ్య (వయా గుత్తి) ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. హైదరాబాద్‌-తిరుపతి (నెం. 07509) ప్రత్యేక రైలు ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదున్నరకు తిరుపతికి చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు 19న తిరుపతిలో రాత్రి 8-15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు. ఈ రైలును కేవలం ఆఫ్‌ అండ్‌ డౌన్‌ ఒక ట్రిప్పు మాత్రమే నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.

Updated Date - 2022-06-16T17:01:04+05:30 IST