HYD: కోకాపేటలో మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-01-11T16:27:13+05:30 IST

నగర శివారు కోకాపేటలో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు.

HYD: కోకాపేటలో మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్‌: నగర శివారు కోకాపేటలో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఓ మాల్‌లో సేల్స్‌ఉమెన్‌గా పనిచేసే బాలమణిగా గుర్తించారు. అలాగే నిందితుడు కందుకూరుకు చెందిన పరమేశ్వర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరమేశ్వర్‌, బాలమణి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే బాలమణి మరో వ్యక్తితో చనువుగా ఉంటుందంటూ పరమేశ్వర్ హత్యకు పూనుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-11T16:27:13+05:30 IST