Hyderabadలో మరోసారి డ్రంకన్ డ్రైవ్ ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-16T17:01:52+05:30 IST

నగరంలో మరోసారి డ్రంకన్ డ్రైవ్ ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 2లో అతివేగంగా దూసుకువచ్చిన కారు... వింగర్ వాహనాన్ని ఢీ కొట్టింది.

Hyderabadలో మరోసారి డ్రంకన్ డ్రైవ్ ప్రమాదం

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రంకన్ డ్రైవ్ ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 2లో అతివేగంగా దూసుకువచ్చిన కారు... వింగర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాదానికి కారణమైన ఐ20 కారు యువకులు పరారయ్యారు. యువకులు మద్యం మత్తులో ఈ ప్రమాదానికి కారణమైనట్లు  పోలీసులు గుర్తించారు. వాహనం వదిలేసి యువకులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-12-16T17:01:52+05:30 IST