HYD: హెబ్రోన్ చర్చ్‌పై సిటీ సివిల్ కోర్ట్ కీలక తీర్పు

ABN , First Publish Date - 2021-12-02T19:03:48+05:30 IST

నగరంలోని హెబ్రోన్ చర్చ్‌పై సిటీ సివిల్ కోర్ట్ కీలక తీర్పును వెలువరించింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పును ప్రకటించింది.

HYD: హెబ్రోన్ చర్చ్‌పై సిటీ సివిల్ కోర్ట్ కీలక తీర్పు

హైదరాబాద్: నగరంలోని హెబ్రోన్ చర్చ్‌పై సిటీ సివిల్ కోర్ట్ కీలక తీర్పును వెలువరించింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పును ప్రకటించింది. హెబ్రోన్ చర్చ్ ట్రస్ట్ సభ్యులదే అంటూ సిటీ సివిల్ కోర్ట్ తీర్పునిచ్చింది. హెబ్రోన్ చర్చ్ సొసైటీ సభ్యులకు సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది. హెబ్రోన్ చర్చ్‌పై  సొసైటీ సభ్యులు గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రస్ట్ సభ్యులకు హెబ్రోన్ చర్చ్‌కి సంబంధం లేదని సొసైటీ సభ్యులు పిటీషన్ దాఖలు చేశారు. ట్రస్ట్ తరుపున ఎఫ్‌సీఎస్ పీటర్, థియోటర్ రిజనాల్డ్ వాదనలు వినిపించారు. కాగా ట్రస్ట్ సభ్యుల వాదనతో ఏకీభవించిన సిటీ సివిల్ కోర్టు... హెబ్రోన్ చర్చ్ ట్రస్ట్ సభ్యులదే అంటూ తుది తీర్పును ప్రకటించింది. 

Updated Date - 2021-12-02T19:03:48+05:30 IST