హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసుల హడావిడి నెలకొంది. అధికార పార్టీ ధర్నా సందర్భంగా ధర్నాచౌక్ వద్ద క్లినింగ్ నిర్వహిస్తున్నారు. సాధారణ సమయాల్లో ఇటు వైపు చూడని జీహెచ్ఎంసీ సిబ్బంది... అధికార పార్టీ ధర్నాతో హడావుడి చేపట్టారు. వీధి వ్యాపారులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. గతంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళనలు వద్దన్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఎలా ఆందోళనలు చేస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.