తెలుగు అకాడమీ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు

ABN , First Publish Date - 2021-10-14T15:46:01+05:30 IST

తెలుగు అకాడమీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కాజేసిన రూ.64 కోట్ల నిధులకు సంబంధించిన వివరాలను సీసీఎస్ పోలీసులు రాబడుతున్నారు.

తెలుగు అకాడమీ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు

హైదరాబాద్: తెలుగు అకాడమీ కేసులో  సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కాజేసిన రూ.64 కోట్ల నిధులకు సంబంధించిన వివరాలను సీసీఎస్ పోలీసులు రాబడుతున్నారు. 9 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో  నిందితులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అకాడమీ అధికారులు ఫిర్యాదు చేశారు అనే భయంతో రూ.80 లక్షలు కాల్చేశానoటూ కట్టుకథ చెప్పుకొచ్చారు. నిందితులoదరూ పోలీసులకు ఒక్కో రకమైన కథ చెబుతున్నట్లు సమాచారం. తాను తీసుకున్న అప్పులన్నీ చెల్లించాలని ఓ నిందితుడు పోలీసులకు చెప్పగా...ఒక స్నేహితుడికి రూ.50 లక్షలు అప్పు ఇచ్చానని అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని మరో నిందితుడు తెలిపాడు. కాజేసిన అకాడమీ నిధులతో నిందితులు కొనుగోలు చేసిన ప్లాట్ల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూబీఐ, కెనరా బ్యాంకు మేనేజర్లు మస్తాన్వలి, సాధన కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.20 కోట్లకు పైగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుమార్, సాయికుమార్, వెంకటరమణ నుండి లక్షల్లో నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 మంది నిందితుల నుండి 17 కోట్ల ఆస్తి పత్రాలు స్వాధీనం అయ్యాయి. అలాగే రూ.3 కోట్లు నగదును సీసీ ఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-10-14T15:46:01+05:30 IST