Hyderabad: ఎల్లమ్మబండలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్

ABN , First Publish Date - 2022-07-21T15:31:12+05:30 IST

నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు.

Hyderabad: ఎల్లమ్మబండలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్

హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ఇంటి గ్రిల్స్ తొలగించి మరీ దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగ అలజడితో ఇంటి యజమాని నిద్రలేవడంతో గమనించిన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా సీసీ కెమెరాలు ఆధారంగా ఇంటి యజమాని దొంగను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాడు. దుండగుడు ఎల్లమ్మ బండలోని పీజేఆర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-21T15:31:12+05:30 IST