హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని షాపింగ్‌మాల్‌లో పోకిరీల వికృత చేష్టలకు పాల్పడ్డారు. యువతి దుస్తులు మార్చుకుంటుండగా యువకులు వీడియో తీశారు. హెచ్‌అండ్‌ఎం షాపింగ్‌మాల్‌లో దుస్తులు మార్చుకుంటుండగ వీడియో తీసిన ఇద్దరు యువకులపై యువతి ఫిర్యాదు చేసింది. ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్ అరెస్టయ్యాడు. వీడియో తీసిన సెల్‌ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.