అమెరికాలో భారీ వేతనంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందిన హైదరాబాదీ

ABN , First Publish Date - 2021-05-16T19:08:27+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన యువతి దీప్తికి అమెరికాలోని ప్రముఖ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం లభించింది. సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో రూ.2కోట్ల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యో

అమెరికాలో భారీ వేతనంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందిన హైదరాబాదీ

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన యువతి దీప్తికి అమెరికాలోని ప్రముఖ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం లభించింది. సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో రూ.2కోట్ల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఈ నెల 2న ఎంఎస్(కంప్యూటర్స్)పూర్తి చేసిన దీప్తి.. క్యాంపస్ ఇంటర్యూలో ఉద్యోగాన్ని సాధించారు. ఈ నెల 17 ఆమె ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా.. ఆమె తండ్రి వెంకన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో క్లూస్‌టీం విభాగం అధిపతిగా పని చేస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో దీప్తి మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశారు. అనంతరం రాజీనామా చేసి ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించడంపట్ల ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-05-16T19:08:27+05:30 IST