Advertisement
Advertisement
Abn logo
Advertisement

Global Teacher Prize 2021: టాప్‌ 50లో హైదరాబాద్‌ టీచర్‌.. గెలిస్తే రూ.7 కోట్ల బహుమతి!

జాబితాలో చోటు దక్కించుకున్న మేఘన

లండన్‌: గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌-2021 జాబితాలో హైదరాబాద్‌ ఉపాధ్యాయురాలికి చోటు దక్కింది. రూ.7.36 కోట్ల నగదు అందించే ఈ అవార్డుకు 121 దేశాల నుంచి 8 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు వార్కే ఫౌండేషన్‌ నిర్వాహకులు తెలిపారు. యునెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్‌ ఏటా ఈ అవార్డును అందజేస్తోంది. దరఖాస్తులను వడపోసిన అనంతరం రూపొందించిన టాప్‌ 50 జాబితాలో భారత్‌ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలు ముసునూరి మేఘన, బిహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన సత్యం మిశ్రాకు స్థానం లభించింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని వార్కే ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సన్నీ వార్కే తెలిపారు. గణితం సబ్జెక్టులో హెచ్చవేతలను విద్యార్థులు సులువుగా చేసేందుకు మిశ్రా కొత్త పద్ధతులను రూపొందించారని, తద్వారా పిల్లలు ప్రపంచాన్ని చూసే దృష్టిలో పెనుమార్పులు తేవడంతో పాటు తన సబ్జెక్టును సరళం చేశారన్నారు.


మేఘన విద్యాబోధనలో ఎంతో ముందుచూపున్న, వృత్తి పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఆమె హైదరాబాద్‌లో ఫౌంటెయిన్‌హెడ్‌ గ్లోబల్‌ స్కూల్‌, జూనియర్‌ కాలేజీ వ్యవస్థాపకురాలు, చైర్మన్‌. గూగుల్‌కు చెందిన ‘ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ ఆన్‌ ద వెబ్‌’లో హైదరాబాద్‌ చాంపియన్‌ అని తెలిపారు. చెగ్‌.ఓఆర్‌జీ గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌-2021 జాబితాలో నలుగురు భారత విద్యార్థులకు చోటు దక్కింది. ఈ అవార్డు కింద రూ.77 లక్షల నగదు ఇస్తారు. ఈ రెండు విభాగాల్లో టాప్‌ 10లో నిలిచిన వారి పేర్లను వచ్చేనెల ప్రకటించనున్నారు. గత ఏడాది గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ను మహారాష్ట్రకు చెందిన రంజిత్‌సింగ్‌ దిశాలే గెలుచుకున్నారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement