HYD: పాతబస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2022-05-09T17:14:44+05:30 IST

నగరంలోని పాత బస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

HYD: పాతబస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

హైదరాబాద్: నగరంలోని పాత బస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి గేమ్స్ పేరుతో రోడ్లపై యువత హంగామా సృష్టిస్తోంది. ఈ క్రమంలో రాత్రి 1 నుండి 3 వరకు పోలీసుల దాడులు చేపట్టారు. స్నూకర్ పార్లర్స్‌పై మూకుమ్మడి రైడ్స్ నిర్వహించారు. ఈక్రమంలో మీర్ చౌక్‌లో 21, మొఘల్‌పురలో 27, భవాని నగర్‌లో 11... మొత్తం 59 మందిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. 

Read more