సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ లక్ష్యం 164 పరుగులు

ABN , First Publish Date - 2020-10-18T23:06:33+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రాహుల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ లక్ష్యం 164 పరుగులు

అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠీలు శుభారంభం అందించినప్పటికీ హైదరాబాద్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగుతో పరుగులు రావడం కష్టమయ్యాయి. దీంతో బ్యాట్స్‌మెన్ రాణించినప్పటికి భారీగా పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. 


శుభ్‌మన్ గిల్ (37 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 23 పరుగులు), నితీశ్ రాణా (20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 29 పరుగులు) రాణించారు. రసెల్ ఈ మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.  9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 34 పరుగులు చేయగా, దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. 34 పరుగులు చేసిన మోర్గాన్ ఇన్నింగ్స్ చివరి బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 163 పరుగుల వద్ద కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది.

Updated Date - 2020-10-18T23:06:33+05:30 IST