హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకులను దోచుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై తెలంగాణ ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఓఆర్ఆర్ పెద్ద అంబర్‌పేట్ దగ్గర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశారు. మోతాదుకు మించి లాగేజి క్వారీ చేయడం, అధిక చార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.