హైదరాబాద్‌ రియల్టీ అదుర్స్‌

ABN , First Publish Date - 2022-05-27T06:23:23+05:30 IST

హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్లో జోష్‌ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 715 ఎకరాల్లో..

హైదరాబాద్‌ రియల్టీ అదుర్స్‌

715 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు


న్యూఢిల్లీ: హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్లో జోష్‌ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 715 ఎకరాల్లో వివిధ రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఐదు ఒప్పందాలు జరిగాయి. ఇందులో 600 ఎకరాలు సింగిల్‌ డీల్‌ కావటం విశేషం. గత నాలుగున్నర నెలల్లో దేశంలో మరే నగరంలో ఇంత పెద్ద విస్తీర్ణంలో రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఇన్ని ఒప్పందాలు జరగలేదని రియల్టీ మార్కెట్‌ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ తెలిపింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 1,237 ఎకరాల్లో రియల్టీ ప్రాజెక్టుల అభివృద్థి కోసం 28 ఒప్పందాలు జరిగాయి. ఇందులో 50 శాతానికిపైగా భూమి హైదరాబాద్‌లోనే ఉండడం విశేషం. నివాస గృహాలతో పాటు డేటా కేంద్రాలు, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ రంగాల నుంచి ఏర్పడిన డిమాండ్‌ ఇందుకు ప్రధాన కారణమని అనరాక్‌ తెలిపింది. 

Updated Date - 2022-05-27T06:23:23+05:30 IST