Abn logo
Sep 28 2021 @ 08:44AM

పొంగిపొర్లుతున్న రాజేంద్రనగర్ అప్ప చెరువు

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రాజేంద్రనగర్ అప్ప చెరువు పొంగిపొర్లుతోంది. బెంగళూర్ జాతీయ రహదారి గగన్ పహాడ్ వద్ద రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. అప్ప చెరువు నిండడంతో  అలుగు పొంగిపొర్లుతోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. పోలీసులు ఒక వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. గతేడాది అప్ప చెరువు కట్ట తెగి నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అప్ప చెరువు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే వారు ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...