Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Jul 2021 07:18:57 IST

HYD: నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం

twitter-iconwatsapp-iconfb-icon
HYD: నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం

హైదరాబాద్‌: రాష్ట్రమ్మీద కమ్ముకున్న మేఘం కొన్నిచోట్ల భారీగా.. కొన్నిచోట్ల మోస్తరుగా.. మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షిస్తూనే ఉంది. మరోవైపు వాగులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి ప్రాంతాలు బుధవారం అర్ధరాత్రి కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కూకట్‌పల్లి, మియాపూర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్‎నగర్, అమీర్‎పేట్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, షేక్‌పేట, మెహిదీపట్నం ముసురు పడుతూనే ఉంది. దీంతో బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.