ప్రపంచ బాక్సింగ్‌పై Hyderabad పంచ్‌

ABN , First Publish Date - 2022-05-20T20:01:03+05:30 IST

ప్రపంచ బాక్సింగ్‌పై Hyderabad పంచ్‌

ప్రపంచ బాక్సింగ్‌పై Hyderabad పంచ్‌

  • వరల్డ్‌ చాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌

హైదరాబాద్‌ సిటీ : క్రీడా జగత్తులో మరోసారి హైదరాబాద్‌ (Hyderabad City) ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించింది. గురువారం టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి‌ప్‌లో హైదరాబాదీ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పసిడి పతకం సాధించింది. నిఖత్‌ కుటుంబం నిజామాబాద్‌ నుంచి వచ్చి షేక్‌పేటలో స్థిరపడింది. స్థానికంగాగల జీహెచ్‌ఎంసీ స్టేడియంలో కోచ్‌ చిరంజీవి వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. సానియా, మిథాలీరాజ్‌, సైనా, సింధుతో టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌కు ఏ విధంగా హైదరాబాద్‌ అడ్డాగా మారిందో భవిష్యత్‌లో బాక్సింగ్‌కు కూడా భాగ్యనగరం కేరా‌ఫ్‌గా మారనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  


ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ అభినందన

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌కు ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌ రెడ్డి, కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ డా. కె శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. నిఖత్‌ తమ కళాశాలలో ఎంబీఏ చదువుతుండడం గర్వకారణమన్నా

Updated Date - 2022-05-20T20:01:03+05:30 IST