హైదరాబాద్‌లో జనావాసాల మధ్య పబ్స్.. కమిషనర్లకు హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2022-09-13T00:28:25+05:30 IST

జంటనగరాల్లో జనావాసాల మధ్య పబ్‎లపై హైకోర్టులో విచారణ జరిగింది. మితి మీరిన సౌండ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న పిటిషన్‌పై..

హైదరాబాద్‌లో జనావాసాల మధ్య పబ్స్.. కమిషనర్లకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ (Hyderabad): జంటనగరాల్లో జనావాసాల మధ్య పబ్‎లపై హైకోర్టు (High court)లో విచారణ జరిగింది. మితి మీరిన సౌండ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ధ్వని నియంత్రణ ఉల్లంఘించిన పబ్‌లపై ఎన్ని కేసులు పెట్టారో తెలపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పూర్తి నివేదికను కూడా సమర్పించాలని హైదరాబాద్, సైబరాబాద్ (Cyberabad), రాచకొండ (Rachakonda) సీపీలకు ఆదేశాలు జారీ చేసింది.  పబ్‌లలో మ్యూజిక్, డ్యాన్స్‌లకు ఇచ్చిన అనుమతులను తెలియజేయాలని సూచించింది. లైసెన్స్ మంజూరుకు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నారనే అంశాలను కూడా తెలపాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2022-09-13T00:28:25+05:30 IST