Hyderabad Modi Tour: హైదరాబాద్‎లో పలుచోట్ల 144 సెక్షన్

ABN , First Publish Date - 2022-06-30T02:46:31+05:30 IST

ప్రధాని మోదీ (Pm Modi) హైదరాబాద్‌ టూర్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. జులై 2,3 తేదీల్లో నగరంలో బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు..

Hyderabad Modi Tour: హైదరాబాద్‎లో పలుచోట్ల 144 సెక్షన్

హైదరాబాద్ (Hyderabad): ప్రధాని మోదీ (Pm Modi) హైదరాబాద్‌ టూర్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. జులై 2,3 తేదీల్లో నగరంలో బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. దాంతో పోలీసులు భద్రతపై దృష్టి సారించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.  నో ఫ్లయింగ్‌ జోన్స్‌ను ప్రకటించారు.


హైదరాబాద్‌ పరిధిలోని పరేడ్‌గ్రౌండ్, రాజ్‌భవన్‌ (Rajbhavan) పరిసరాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని నొవాటెల్ (Novatel) వరకు నో ఫ్లయింగ్‌జోన్‎గా ప్రటించారు. డ్రోన్స్ (Drones), రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్, మైక్రోలైట్ ఎయిర్‌క్రాప్స్‌పై నిషేధం విధించారు.  ఈ నెల 30 ఉదయం 6 గంటల నుంచి జులై 4 సాయంత్రం 6 వరకు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2022-06-30T02:46:31+05:30 IST