గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్రంగా ఇంధన కొరత

ABN , First Publish Date - 2022-06-06T22:06:40+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్రంగా ఇంధన కొరత ఏర్పడింది. సిటీలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్రంగా ఇంధన కొరత

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్రంగా ఇంధన కొరత ఏర్పడింది. సిటీలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. సిటీలో 40% పెట్రోల్ బంకులు బంద్ అయ్యాయి. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీలర్లకు క్రెడిట్ విధానాన్ని ఆయిల్ కంపెనీలు నిలిపివేశాయి. దీంతో డీలర్లు డబ్బులు లేక పెట్రోల్, డీజిల్ కొనలేదు. 100 శాతం పేమెంట్ కట్టినా 75 శాతం ఇంధనం మాత్రమే సప్లై చేస్తున్నారు. గ్రేటర్ హైద్రాబాద్‌లో మొత్తం 800 పెట్రోల్ బంకుల్లో 300 బంకులను బంద్ చేశారు.

Updated Date - 2022-06-06T22:06:40+05:30 IST