పాములపాడు జనవరి 23: చలో హైదరాబాద్ పేరున మార్చి 13న లక్షలాది మంది విద్యార్థులు పాల్గొనే సభను జయప్రదం చేయాలని జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు స్వాములు అన్నారు. ఆయన మాట్లాడుతూ మందక్రిష్ణ మాదిగ గత 27 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు, మాదిగ ఉపకులాలు పోరాడుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధిఆధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి అధికార పగ్గాలు చేపట్టి ఏడు ఏళ్లు గడుస్తున్నా వర్గీకరణపై పార్లమెంట్‌లో చర్చ జరగలేదన్నారు. ప్రభుత్వాలను ఎండగట్టే విధంగా విద్యార్థులను సమాయత్తం చేసి మాదిగ విద్యార్థుల సత్తా చాటాలని అన్నారు. నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కోడి శ్రీకాంత, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, కార్యదర్శిగా శివకుమార్, మధు, కార్యవర్గ సభ్యులుగా ప్రభుదాస్ వినోద్‌కుమార్, ప్రభుదేవలను ఎన్నుకున్నారు.