నేడు ఎన్టీఆర్ వర్ధంతి

ABN , First Publish Date - 2021-01-18T12:26:02+05:30 IST

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటలకు టీడీప అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ ఘాట్‌లో

నేడు ఎన్టీఆర్ వర్ధంతి

హైదరాబాద్:  దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు. అటు ఉదయం 9 గంటలకు రసుల్‌పుర నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు నిర్వహించనున్న అమరజ్యోతి ర్యాలీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి సుహాసిని పాల్గొననున్నారు. 10 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో లెజండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను తెలంగాణ తెలుగుదేశం ఏర్పాటు చేసింది. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను  టీడీపీ నిర్వహించనుంది. మంగళగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 

Updated Date - 2021-01-18T12:26:02+05:30 IST