హైదరాబాద్: మధురానగర్‌కు చెందిన భగీరథ అనే 12 ఏళ్ల బాలుడు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ బుడతడు ఆరోతరగతి చదువుతునే.. ఉదయాన్నే పేపర్ వేస్తుంటాడు. తన మొదటి నెల జీతంలో రూ. 5 వందలు గుడికి విరాళంగా ఇవ్వడానికి రావడం.. వైరల్‌గా మారింది. ఈ బాలుడు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. బుడ్డొడిది పెద్ద మనసు అంటూ కొనియాడుతున్నారు.