కన్న కొడుకుపై రాక్షసుడిగా మారిన తండ్రి..

ABN , First Publish Date - 2022-01-07T16:35:10+05:30 IST

విడాకులిచ్చిన భర్త కామాంధుడిలా మారి కొడుకును వేధిస్తున్నాడంటూ ఓ మహిళ...

కన్న కొడుకుపై రాక్షసుడిగా మారిన తండ్రి..

హైదరాబాద్: విడాకులిచ్చిన భర్త కామాంధుడిలా మారి కొడుకును వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఉప్పల్‌కు చెందిన వీణారెడ్డి, భరత్ రెడ్డికి వివాహం జరిగింది. 11 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. వారికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాబును ఇద్దరూ కొద్ది రోజులపాటు ఉంచుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బాబు తండ్రి వద్ద కొన్ని రోజులు, తల్లి దగ్గర మరికొన్ని రోజులు ఉంటున్నాడు. అయితే తన కొడుకును విడాకులిచ్చిన భర్త లైంగికంగా వేధిస్తున్నాడంటూ వీణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోమో సెక్సువల్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడంటూ వాపోయారు. సంబంధిత డాక్టర్ రిపోర్టును పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు భరత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-01-07T16:35:10+05:30 IST