వివాదంలో చిక్కుకున్న 75ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్

ABN , First Publish Date - 2021-12-29T18:48:17+05:30 IST

సికింద్రాబాద్, వారసిగూడలో 75ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్ వివాదంలో చిక్కుకుంది.

వివాదంలో చిక్కుకున్న 75ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్

హైదరాబాద్: సికింద్రాబాద్, వారసిగూడలో 75ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్ వివాదంలో చిక్కుకుంది. వేలాదిమందిని తీర్చి దిద్దిన స్కూల్ ఇప్పుడు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌గా మారబోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు, పాఠాలు భోదించే అధ్యాపకులు నిరాశ్రయులయ్యారు. స్కూల్‌ను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. అదే స్థానంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టే ప్రయత్నం చేయడంతో స్థానికులు, స్కూల్ అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నండూరి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుమీద నడిచిన స్కూల్‌ను యాధావిధిగా కొనసాగించాలని స్థానికులు ఆందోళన చేశారు. వందలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేశారు. ‘రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్దు.. స్కూలే ముద్దు’ అంటూ ఆందోళన బాట పట్టారు.

Updated Date - 2021-12-29T18:48:17+05:30 IST