సంధ్య కన్వెన్షన్ ఎండీకి లూక్ అవుట్ నోటీసులు

ABN , First Publish Date - 2021-11-30T17:21:23+05:30 IST

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావుకు పోలీసులు లూక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

సంధ్య కన్వెన్షన్ ఎండీకి లూక్ అవుట్ నోటీసులు

హైదరాబాద్: చీటింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చి పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావుకు పోలీసులు లూక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నార్సింగి, రాయదుర్గం పీఎస్‌లో ఉన్న రెండు కేసులకు సంబంధించి శ్రీధర్‌రావు విచారణకు హాజరు కావడంలేదు. దీంతో ఆయన కోసం సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేశారు. 

Updated Date - 2021-11-30T17:21:23+05:30 IST