Hyderabad: అప్పుడు 173.. ఇప్పుడు 179

ABN , First Publish Date - 2021-11-10T15:53:28+05:30 IST

నగరంలో వైన్‌ షాపుల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ అజయ్‌రావు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు

Hyderabad: అప్పుడు 173.. ఇప్పుడు 179

హైదరాబాద్‌ సిటీ: నగరంలో వైన్‌ షాపుల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ అజయ్‌రావు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే నగరంలో ఆరు వైన్‌ షాపులు పెరిగాయన్నారు. హైదరాబాద్‌లో 80 (రెండేళ్ల క్రితం 79), సికింద్రాబాద్‌లో 99 (రెండేళ్ల క్రితం 94) షాపులకు గాను దరఖాస్తులు ఆహ్వానించారు. వాటిలో హైదరాబాద్‌లో 10 (ఎస్టీ-1, ఎస్సీ - 4, గౌడ-5), సికింద్రాబాద్‌లో 14 (ఎస్టీ -1, ఎస్సీ -7, గౌడ-6) షాపులు రిజర్వేషన్ల కింద ఉన్నాయని, మిగతావి ఓపెన్‌ కేటగిరీ కింద ఉన్నాయని వెల్లడించారు. 21 ఏళ్ల వయస్సు నిండి, ఎక్సైజ్‌ చట్టం కింద శిక్ష అనుభవించని వారు వారెవ్వరైనా దరఖాస్తులకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 18. రెండేళ్ల క్రితం 173 షాపులకు గాను సుమారు 1600 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-11-10T15:53:28+05:30 IST