Hyderabadలో 13నెలల చిన్నారి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-09-13T15:57:08+05:30 IST

నగరంలోని మియాపూర్‌‌లో విషాదం చోటు చేసుకుంది. 13 నెలల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Hyderabadలో 13నెలల చిన్నారి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌‌లో విషాదం చోటు చేసుకుంది. 13 నెలల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మియపూర్ ఓంకార్ నగర్‌లో నిన్న  సాయంత్రం నుండి కనిపించకుండా పోయిన చిన్నారి... ఈ రోజు తెల్లవారుజామున ఇంటి ముందు శవమై కనిపించింది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. పాప కళ్ళు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-09-13T15:57:08+05:30 IST