Hyd: రెండో రోజు BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు

ABN , First Publish Date - 2022-07-03T17:00:49+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు...

Hyd: రెండో రోజు BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ఆదివారం మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4-30 గంటల వరకు జరగనున్నాయి.  హెచ్ఐసీసీ (HICC) వేదికగా జరుగుతున్న ఈ సమావేశాల్లో భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. నిన్న మొదటి రోజు సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ (Modi) రాత్రి నోవాటెల్ (Novotel) హోటల్‌లో బస చేశారు. తెలంగాణలో పాగావేయాలనే ప్రయత్నాలు.. దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది.


ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు, 350 మంది ప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. నిన్న శనివారం తొలిరోజు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ రోజు కార్యవర్గ సమావేశంలో మోదీ, అమిత్ షాలు ప్రసంగించనున్నారు. పార్టీ బలోపేతానికి ఉద్దేశించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తామని హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రధాని ట్వీట్  చేసిన విషయం తెలిసిందే. కార్యవర్గం సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. లక్షలాది మంది పాల్గొనే ఈ భారీ బహిరంగసభలో ప్రదాని మోదీ పాల్గొని కీలక ఉపన్యాసం చేయనున్నారు.

Updated Date - 2022-07-03T17:00:49+05:30 IST