Amnesia Pub Rape Case : ABN చేతిలో బాధితురాలి రెండో Statement.. సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-06-09T16:55:03+05:30 IST

జూబ్లీ హిల్స్ రేప్‌ కేసు (Rape case) బాధితురాలి స్టేట్‌మెంట్ ABN ఆంధ్రజ్యోతి చేతికి చిక్కింది.

Amnesia Pub Rape Case : ABN చేతిలో బాధితురాలి రెండో Statement.. సంచలన విషయాలు

Hyderabad: తెలుగు  రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన జూబ్లీ హిల్స్ రేప్‌ కేసు (Rape case) బాధితురాలి స్టేట్‌మెంట్ ABN ఆంధ్రజ్యోతి చేతికి చిక్కింది. రెండోసారి ఇచ్చిన స్టేట్‌మెంట్ (Statement) రికార్డులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను ఇంటి దగ్గర దింపుతామని ట్రాప్ చేసి మరీ అత్యాచారం చేశారని, నిందితులే తనను బలవంతం చేశారని బాధితురాలు స్టేట్‌మెంట్ ఇచ్చింది. పబ్ నుంచి బయటకు వచ్చిన తన స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిందని, తనను పబ్‌కి తీసుకొచ్చిన స్నేహితుడు పబ్ లోపలే ఉన్నాడని, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయలేదని బాధితురాలు తెలిపింది. అప్పటికే నిందితులు తనను ఫాలో అయ్యారని, క్యాబ్ బుక్ చేస్తామంటూ తన ఫోన్ లాక్కున్నారని బాధితురాలు తెలిపింది. ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా లేదని తామే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటూ.. తనను బెంజ్ కారులో ఎక్కించుకున్నారని తెలిపింది.


పబ్ నుంచి బెంజ్ కారు బంజారాహిల్స్ కాన్స్ బేకరి దగ్గరకు వెళ్లిందని,  కారులో ఉన్నప్పుడే నిందితులు తన హ్యాండ్ బ్యాగ్, కళ్ళజోడు లాక్కున్నారని బాధితురాలు పేర్కొంది. ఆదే సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని,  బెంజ్ కారు ఇరుకుగా ఉందంటూ ఇన్నోవా కారులోకి మార్చారని తెలిపింది. తన హ్యాండ్ బ్యాగ్, కళ్ళజోడు ఇస్తారేమోనని కారులోకి వెళ్ళానని, ఇన్నోవా కారులోనే నిందితులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చింది.


కాగా.. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు బంజారాహిల్స్‌ ఏసీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌కు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని.. నేటి నుంచి అతణ్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు. ఇదే ఘటనకు సంబంధించి జువైనల్‌ హోంలో ఉన్న మరో ఐదుగురు మైనర్లను కూడా విచారిస్తామని, కోర్టు అనుమతికోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ కేసులో నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని వివరించారు. ఇప్పటికే లభించిన ఆధారాలతో పాటు.. సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేయాల్సి ఉందన్నారు.

Updated Date - 2022-06-09T16:55:03+05:30 IST