Hyderabad: మైనర్ బాలిక అత్యాచార కేసులో ఆధారాలు మాయం..

ABN , First Publish Date - 2022-06-05T16:37:17+05:30 IST

జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ (Gang rape) కేసులో నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారు..

Hyderabad: మైనర్ బాలిక అత్యాచార కేసులో ఆధారాలు మాయం..

Hyderabad: జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ (Gang rape) కేసులో నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారు (Innova car) నెంబర్ టీఎస్09ఎఫ్‌హెచ్3786(TS09FH3786)గా పోలీసులు గుర్తించారు. వాహనం దినాజ్ జహన్ పేరుతో ఉంది. ఇన్నోవాలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు తర్వాత వాహనాన్ని దాచిపెట్టారు. శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌కు వాహనాన్ని తరలించారు. రిజిస్ట్రేషన్ నెంబర్‌ను చెరిపివేశారు. నిందితులు కారులో లైంగిక దాడికి సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. పట్టుబడ్డ నిందితుల్లో ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ 2019లో జరిగినా.. ఇప్పటివరకు దాన్ని టీఆర్ నెంబర్‌తోనే తిప్పుతున్నా.. రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదు.


కాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హనుమకొండలో మెరుపు దర్నాకు దిగారు. హైదరాబాద్‌లో మైనర్ బాలికను రేప్ చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను ప్రభుత్వం కాపాడే యత్నం చేస్తోందని ఆరోపించారు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కాదని.. ఇలాంటి దుండగులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని ఆమె డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-05T16:37:17+05:30 IST