IPS అధికారిణిని అభ్యంతరకర మెసేజ్లతో వేధిస్తున్న nri అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-11T17:51:32+05:30 IST

IPS అధికారిణిని అభ్యంతరకర మెసేజ్‌లతో ఓ ఎన్నారై (nri) వేధింపులకు గురిచేస్తుండడంతో...

IPS అధికారిణిని అభ్యంతరకర మెసేజ్లతో వేధిస్తున్న nri అరెస్ట్

Hyderabad: IPS అధికారిణిని అభ్యంతరకర మెసేజ్‌లతో ఓ ఎన్నారై (nri) వేధింపులకు గురిచేస్తుండడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. గ్రీన్ కార్డ్  హోల్డర్ అయిన ఘల్ రాజు.. అమెరికాలోని Californiaలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా పంజాబ్ మహిళా ఐపీఎస్ అధికారిణిని వేధిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఘల్ రాజు తన స్వస్థలమైన పంజాబ్‌కు వచ్చాడు. కాగా మహిళా ఐపీఎస్ అధికారిణి హైదరాబాద్‌లో hrd శిక్షణ తీసుకుంటున్న విషయం తెలుసుకుని నగరానికి వచ్చాడు. హెచ్ఆర్డీ లోపలకువెళ్లి మహిళా ఐపీఎస్ అధికారిణిని వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘల్ రాజుని పోలీసులు అరెస్టు చేశారు.

Read more