Hyd: గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్టు ధర్నా

ABN , First Publish Date - 2022-05-09T18:32:18+05:30 IST

జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45వద్ద గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్టు ధర్నాకు దిగింది.

Hyd: గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్టు ధర్నా

Hyderabad: జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45వద్ద గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్టు ధర్నాకు దిగింది. గీతా ఆర్ట్స్ వారు తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఆమె నిరసన వ్యక్తం చేసింది. అర్ధ నగ్నంగా నిరసన తెలుపుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని, సినిమాల్లో అవకాశం ఇస్తానని తనను నమ్మించి లైంగికంగా దాడి చేసి మోసం చేశాడని సునీత బోయ అనే మహిళ ఆర్టిస్టు ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ఇప్పుడు గీతా ఆర్ట్స్ వారు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలుపుతూ కార్యాలయం ముందు అర్థనగ్నంగా నిరసన తెలపడంతో అక్కడున్న స్థానికులు ఇచ్చిన సమాచారంతో మహిళా పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ఆమెను జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత కొంత కాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సునీత బోయ అనే ఆర్టిస్టుకు తాము ఒక్క రూపాయి కూడా బాకీ లేమని గీతా ఆర్ట్స్ ఆఫీసు సిబ్బంది తెలిపారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more