చంచల్‌గూడ జైల్‌లో ములాఖత్‌కు Rahul gandhiకి అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-05-06T20:17:19+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పర్యటనకు మరో షాక్‌ తగిలింది.

చంచల్‌గూడ జైల్‌లో ములాఖత్‌కు Rahul gandhiకి అనుమతి నిరాకరణ

Hyderabad: తెలంగాణలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పర్యటనకు మరో షాక్‌ తగిలింది. చంచల్‌గూడ జైల్‌లో ములాఖత్‌కు అనుమతి లభించలేదు జైల్లో NSUI నేతలను కలిసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అనుమతి కోరారు. అందుకు జైలు సూపరింటెండెంట్ నిరాకరించారు. కాగా ఇప్పటికే రాహుల్‌ ఓయూలో పర్యటించేందుకు వీసీ అనుమతించలేదు. దీనిపై నిరసన తెలుపుతూ ఎన్ఎస్‌యూఐ నేత‌లు నిర‌స‌న‌కు దిగారు. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. జైల్లో వారితో ములాఖత్‌ అయ్యేందుకు రాహుల్‌‌ను అనుమతించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు జైలు సూపరింటెండెంట్‌కు వినతి పత్రం సమర్పించారు. అందుకు ఆయన నిరాకరించారు.


మరోవైపు వరంగల్‌లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొనడంలేదు. ఆరోగ్య సమస్యలతో రాహుల్ రైతు సంఘర్షణ సభకు గైర్హాజరవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. వరంగల్ రాహుల్ సభకు సైతం డుమ్మా కొట్టడంతో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

Read more