శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా Drugs పట్టివేత

ABN , First Publish Date - 2022-05-03T16:24:55+05:30 IST

Hyderabad: నగరంలో Drugs మాఫియా మరోసారి పడగ విప్పింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా Drugs పట్టివేత

Hyderabad: నగరంలో Drugs మాఫియా మరోసారి పడగ విప్పింది. ఇక్కడి మార్కెట్‌పై డ్రగ్స్ ముఠాలు కన్నేశాయి. ఎన్నిసార్లు ఎంతమందిని అరెస్టు చేసినా.. భాగ్యనగరానికి అంటుకున్న డ్రగ్స్ మత్తు వదలడంలేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా స్మగ్లింగ్‌కు తెరలేపుతున్నారు. శంషాబాద్ విమానాశ్రమంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు కూ. 80 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. టాంజానియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద నాలుగు కేజీల చొప్పున బయటపడిందని తెలిపారు. కొకైన్ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో కొకైన్ పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతోనే నిఘా పెట్టి తనిఖీ చేశామని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఎంత నిఘా పెంచినా మత్తు స్మగ్లింగ్ ఆగడంలేదు.

Read more