ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

ABN , First Publish Date - 2022-01-12T15:47:57+05:30 IST

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటికి బుధవారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు.

ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

హైదరాబాద్: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటికి బుధవారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు నలుగురు సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని రఘురామ నివాసానికి వచ్చారు. అయితే రఘురామ బయటకు రాకపోవడంతో సీఐడీ అధికారులు ఇంటి బయట వేచి చేస్తున్నారు.


గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో రఘురామ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసేందుకు వచ్చామని సీఐడీ అధికారులు చెబుతున్నప్పటికీ ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నరన్న విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా రఘురామను అరెస్టు చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదు. గతంలో ఉన్న కేసులకు సంబంధించి రఘురామ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన అడ్వకేట్‌లతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు మాట్లాడుతున్నారు.



Updated Date - 2022-01-12T15:47:57+05:30 IST