హైదరాబాద్: మెట్రో రైళ్లు నిలిపివేత

ABN , First Publish Date - 2022-06-17T21:34:19+05:30 IST

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లను నిలిపివేశారు.

హైదరాబాద్: మెట్రో రైళ్లు నిలిపివేత

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికులెవ్వరూ మెట్రో స్టేషన్లకు రావొద్దని అధికారులు సూచించారు. MMTS రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. ప్రయాణికులు మెట్రో రైళ్ల కోసం వచ్చి వెనక్కి  తిరిగివెళ్తున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైలు సేవల నిలిపివేతపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో, MMTS రైళ్ల  రద్దుతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆటోలకు గిరాకీ పెరిగింది. 


మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 71 రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లను ఇప్పటికే దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2022-06-17T21:34:19+05:30 IST