LB NAGAR.. గుంతలమయంగా రహదారులు

ABN , First Publish Date - 2021-10-14T17:21:15+05:30 IST

నగర శివారు రోడ్లు అధ్వానంగా మారాయి. హయత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్లతో పాటు మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లు, తుర్కయంజాల్‌, పెద్దఅంబర్‌పేట

LB NAGAR.. గుంతలమయంగా రహదారులు

ప్రమాదాల బారిన వాహనదారులు 

పట్టించుకోని అధికారులు

హైదరాబాద్/ఎల్‌బీనగర్‌: నగర శివారు రోడ్లు అధ్వానంగా మారాయి. హయత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్లతో పాటు మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లు, తుర్కయంజాల్‌, పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘాల పరిధిలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వర్షాలు కురిసిన ప్రతీసారి గుంతల్లో నీళ్లు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని గాయత్రి హోమ్స్‌, సర్వోదయకాలనీ, మీర్‌పేట-అల్మా్‌సగూడ ప్రధాన రహదారి, ప్రశాంత్‌హిల్స్‌ ప్రాంతాలలో రహదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎల్‌బీనగర్‌, ఆటోనగర్‌లలో జాతీయ రహదారిపై కంకరతేలడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. లింగోజిగూడ డివిజన్‌ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలలో రోడ్లు దెబ్బతిన్నాయి.


చంపాపేట: ఇటీవల కురిసిన వర్షాలకు చంపాపేట, హస్తినాపురం డివిజన్‌లలోని పలు కాలనీలలో రహదారులు దెబ్బతిన్నాయి. చంపాపేట చౌరస్తాలో వర్షాలకు ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. డివిజన్‌లోని పద్మానగర్‌కాలనీ, ఉదయ్‌నగర్‌కాలనీ, మల్‌రెడ్డి రంగారెడ్డికాలనీలలో వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి. హస్తినాపురం డివిజన్‌లోని బీమానగర్‌కాలనీ ప్రధాన రహదారి వర్షాలకు గుంతలమయంగా మారింది. 

అబ్దుల్లాపూర్‌మెట్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారులో రోడ్డులు గుంతలమయంగా మారాయి. ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్ల కల్వర్టులపై నుంచి వరద ప్రవాహించడంతో కోతకు గురయ్యాయి. కవాడిపల్లి నుంచి బలిజగూడ వెళ్లేరోడ్డు దారుణంగా తయారయింది. పెద్దఅంబర్‌పేట్‌ నుంచి శాంతినగర్‌ కాలనీ రోడ్డు దుస్థితి కూడా అధ్వానంగా మారింది. తట్టిఅన్నారం నుంచి మర్రిపల్లి రోడ్డు గుంతల మయంగా తయారయింది.

Updated Date - 2021-10-14T17:21:15+05:30 IST