దత్తతకు కుక్కలు.. హైదరాబాద్‌లో వ్యక్తిపై కేసు

ABN , First Publish Date - 2021-12-30T01:35:50+05:30 IST

హైదరాబాద్‌లో వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. కూకట్ పల్లి మలేషియా టౌన్ షిప్ లో తలెత్తిన వీధి కుక్కుల సమస్య ఎఫ్ ఐఆర్ వరకూ వెళ్లింది. కుక్కల తరపున ..

దత్తతకు కుక్కలు.. హైదరాబాద్‌లో వ్యక్తిపై కేసు

హైదరాబాద్‌: నగరంలో వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. కూకట్ పల్లి మలేషియా టౌన్‌షిప్‌లో తలెత్తిన వీధి కుక్కల సమస్య ఎఫ్‌ఐఆర్ వరకూ వెళ్లింది. కుక్కల తరపున పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగారు.  దీంతో వీధి కుక్కల బారి నుంచి రక్షించాలని మలేషియా టౌన్‌షిప్ వాసులు మీడియా ఎదుట వాపోయారు. 


మలేషియా టౌన్ షిప్‌లో రెయిన్ ట్రీ పార్క్‌లో గతేడాది నుంచి వీధి కుక్కల బెడద ఎక్కువయింది. కాలనీలో నడుచుకుంటూ వెళ్లే వారిని, బైక్‌లపై వెళ్లే వారిని కుక్కలు వెంట పడి కరుస్తున్నాయి. కుక్కలు వెంట పడి కరవడంతో ఇటీవల పలువురు ఆస్పత్రి పాలయ్యారు. కాలనీ వాసులంతా కలిసి కుక్కలను ఓ సంస్థకు దత్తత ఇచ్చారు. 


విషయం తెలుసుకున్న పీపుల్స్ ఫర్ యానిమల్స్ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. కాలనీ ప్రెసిడెంట్‌పై కేసు పెట్టారు. దీంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 



Updated Date - 2021-12-30T01:35:50+05:30 IST