బెంగళూరులో రోడ్లు అధ్వానం

ABN , First Publish Date - 2022-04-04T09:16:52+05:30 IST

‘డిజిటల్‌ బుక్‌ కీపింగ్‌ స్టార్టప్‌’ ఖాతాబుక్‌ కంపెనీ సీఈవో రవీశ్‌ నరేశ్‌ మార్చి 30న బుధవారం ఓ ట్వీట్‌ చేశారు. భారత్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన...

బెంగళూరులో  రోడ్లు అధ్వానం

  • యువ పారిశ్రామికవేత్తల ట్వీట్‌
  • వెంటనే హైదరాబాద్‌ వచ్చేయండి
  • రీట్వీట్‌తో మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం
  • బెంగళూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. యువపారిశ్రామికవేత్తల ట్వీట్‌
  • బ్యాగ్‌ సర్దుకుని వెంటనే హైదరాబాద్‌ వచ్చేయండి..  మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌


బెంగళూరు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి):  ‘డిజిటల్‌ బుక్‌ కీపింగ్‌ స్టార్టప్‌’ ఖాతాబుక్‌ కంపెనీ సీఈవో రవీశ్‌ నరేశ్‌ మార్చి 30న బుధవారం ఓ ట్వీట్‌ చేశారు. భారత్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరంలోని హెచ్‌ఎ్‌సఆర్‌ లేఅవుట్‌, కోరమంగళ ప్రాంతాల్లో స్టార్ట్‌ఆ్‌పలు వందల కోట్లు పన్ను చెల్లిస్తున్నారని కానీ ఆ రెండు ప్రాంతాల్లోనూ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రతిరోజూ కరెంటు కోతలు ఉన్నాయని, నీటిసరఫరా దారుణమని, ఫుట్‌పాత్‌లు సక్రమంగా లేవంటూ ట్వీట్‌ చేశారు. ట్రాఫిక్‌ సమస్య నిరంతరమని సమీపంలోనే ఉండే ఎయిర్‌పోర్టుకు వెళ్ళాలంటే మూడుగంటలు పడుతోందంటూ ట్వీట్‌ చేశారు. మరో స్టార్టప్‌ ‘సేతు ఏపీఐ’ మేనేజర్‌ నిఖిల్‌ కుమార్‌ కూడా రవీ్‌షనరేష్‌ ట్వీట్‌పై స్పందించారు. ‘‘బెంగళూరు అధ్వానంగా మారిందని చెబుతున్నా దయచేసి గమనించండి పరిస్థితిని సరిచేయకుంటే సామూహికంగా వలసలు ప్రారంభమవుతాయి’’ అంటూ  ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు ట్వీట్‌ చేశారు.


 కాగా రవీశ్‌నరే్‌ష ట్వీట్‌పై మరుసటి  రోజున గురువారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. మీ బ్యాగ్‌లు ప్యాక్‌ చేసుకుని హైదరాబాద్‌కు రండంటూ ట్వీట్‌ చేశారు. ‘మేం ఉత్తమమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మా ఎయిర్‌పోర్టు ఉత్తమమైనది. నగరంతో పాటు బయటకు వెళ్లేందుకు సులభతరమైన మార్గాలు ఉన్నాయి’’ అని ట్వీట్‌ చేశారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌  అనే మూడు మంత్రాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందంటూ ట్వీట్‌ చేశారు. కాగా రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ప్రియాంకఖర్గే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో కంపెనీలను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నారని ముఖ్యమంత్రి బొమ్మై వెంటనే అప్రమత్తం కావాలన్నారు. స్టార్ట్‌ఆప్‌ కంపెనీల వారు కోరింది మౌలిక సదుపాయాలు మాత్రమే అనేది తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-04-04T09:16:52+05:30 IST