హైదరాబాద్: కేపీహెచ్‌బీ ఫేజ్-4లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ నీటి గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. నీటి గుంతల్లో నుంచి బాలికల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. గుంతలో లోతుగా నీళ్లు ఉండటంతో బాలికలు ఊపిరాడక మృతి చెందారు. మృతులు పర్వేజ్, రమ్య, సంగీతగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి