బజాజ్‌ ఫైనాన్స్‌లో రుణం పేరుతో తొమ్మిది లక్షలు మాయం

ABN , First Publish Date - 2021-06-18T18:25:21+05:30 IST

బజాజ్‌ ఫైనాన్స్‌లో రుణం పేరుతో అనిల్‌కుమార్‌ అనే వ్యక్తిని ట్రాప్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు తొమ్మిది లక్షలకు పైగా కాజేశారు. తాడ్‌బంద్‌కు చెందిన అనిల్‌కుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగి

బజాజ్‌ ఫైనాన్స్‌లో రుణం పేరుతో తొమ్మిది లక్షలు మాయం

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: బజాజ్‌ ఫైనాన్స్‌లో రుణం పేరుతో అనిల్‌కుమార్‌ అనే వ్యక్తిని ట్రాప్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు తొమ్మిది లక్షలకు పైగా కాజేశారు. తాడ్‌బంద్‌కు చెందిన అనిల్‌కుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. రెండు రోజుల క్రితం అతనికి ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి తాను బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగిని అని, మీకు అంగీకారమైతే పెద్ద మొత్తంలో రుణం ఇవ్వడానికి సిద్ధమని చెప్పాడు. వెంటనేఅంగీకరించిన అనిల్‌కుమార్‌ అతడు అడిగినట్లుగా ఆధార్‌ కార్డు, బ్యాంకు డెబిట్‌ కార్డు నెంబర్‌, సీవీవీ, పాస్‌వర్డ్‌ నెంబర్‌తోపాటు మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నెంబర్లు కూడా చెప్పాడు. అతడితో కాల్‌ మాట్లాడుతూనే వివరాలన్నీ సేకరించిన కేటుగాళ్లు పలు విడుతలుగా మొత్తం రూ.9.44లక్షలు అతని ఖాతా నుంచి తమ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని కాల్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత తన మొబైల్‌కు వచ్చిన మెసేజీల ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు డెబిట్‌ అయిన విషయం తెలుసుకున్న అనిల్‌కుమార్‌ తనకు ఫోన్‌ వచ్చిన నెంబర్‌కు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో అతను గురువారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2021-06-18T18:25:21+05:30 IST