ఉద్యోగం కావాలంటూ ఫేస్‌బుక్‌లో తన బయోడెటా పెట్టి

ABN , First Publish Date - 2021-06-18T17:54:30+05:30 IST

ఉద్యోగం కావాలంటూ ఫేస్‌బుక్‌లో తన బయోడెటా పెట్టి యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు మూడు లక్షలు కాజేశారు. మెహిదీపట్నంకు చెందిన అమీనాబేగం ఉద్యోగం కోసం

ఉద్యోగం కావాలంటూ ఫేస్‌బుక్‌లో తన బయోడెటా పెట్టి

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: ఉద్యోగం కావాలంటూ ఫేస్‌బుక్‌లో తన బయోడెటా పెట్టి యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు మూడు లక్షలు కాజేశారు. మెహిదీపట్నంకు చెందిన అమీనాబేగం ఉద్యోగం కోసం వెతుకులాటలో భాగంగా తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో బయోడేటా పోస్టు చేసింది. రెండు రోజుల క్రితం సురేష్‌ అనే వ్యక్తి ఆమెకు కాల్‌ చేశాడు. యూఏఈలో ఉద్యోగం ఉందని, రూ.లక్షల్లో జీతం ఉంటుందని ముగ్గులోకి లాగాడు. ప్రాసెస్‌ కోసం రూ.3లక్షలు ఖర్చవుతుందని నమ్మించాడు. అతడు చెప్పినట్లే అతడి ఖాతాకు రూ.3లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. అ తర్వాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయనని గ్రహించి గురువారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదుచేసింది. 

Updated Date - 2021-06-18T17:54:30+05:30 IST