టీసీఎస్‌ ఉద్యోగినిని ఉచ్చులోకి లాగిన సైబర్‌ మోసగాళ్లు..

ABN , First Publish Date - 2021-06-18T17:48:57+05:30 IST

షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో టీసీఎస్‌ ఉద్యోగినిని ఉచ్చులోకి లాగిన సైబర్‌ మోసగాళ్లు మూడున్నర లక్షల దాకా కాజేశారు. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల

టీసీఎస్‌ ఉద్యోగినిని ఉచ్చులోకి లాగిన సైబర్‌ మోసగాళ్లు..

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో టీసీఎస్‌ ఉద్యోగినిని ఉచ్చులోకి లాగిన సైబర్‌ మోసగాళ్లు మూడున్నర లక్షల దాకా కాజేశారు. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం ముషీరాబాద్‌కు చెందిన హరిణీ టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె మొబైల్‌ ఫోన్‌కు ఒక లింక్‌ వచ్చింది. అది క్లిక్‌ చేసి చూడగా టెలిగ్రామ్‌ సోషల్‌మీడియా యాప్‌లో విప్రో ఇండస్ట్రీస్‌ పేరుతో పేజీ ఓపెన్‌ అయింది. ఇంతలో ఆమెకు ఫోన్‌ చేసిన కేటుగాళ్లు ప్రస్తుతం షేర్‌మార్కెట్‌లో విప్రో ఇండస్ట్రీస్‌ ట్రెండింగ్‌లో ఉందని, వారం పది రోజుల్లో పెట్టుబడి నాలుగింతలు అయ్యే అవకాశముందని నమ్మించారు. వారి మాటలు నమ్మిన ఆమె పలు విడతలుగా మొత్తం నాలుగు లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. నాలుగు లక్షలలో సాంకేతిక సమస్య రావడంతో అరవై వేలకు పైగా వదిలేసిన కేటుగాళ్లు మొత్తం రూ.3.33లక్షలు కాజేశారు. ఆ తర్వాత మళ్లీ లింక్‌ తిరిగి ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించగా ఓపెన్‌ కాలేదు. కాల్‌ వచ్చిన నెంబర్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుండటంతో మోసపోయానని గ్రహించి గురువారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదుచేసింది. 

Updated Date - 2021-06-18T17:48:57+05:30 IST