Advertisement
Advertisement
Abn logo
Advertisement

Hyderabad: గణేష్ ఉత్సవాలు..నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‎సాగర్‎లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. హుస్సేన్ సాగర్‎లో ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని ప్రభుత్వానికి సూచించింది. హుస్సేన్ సాగర్‎లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని, లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు సూచించింది_


చివరగా.. తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసులు అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారించింది. పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసి తాజాగా తీర్పును వెల్లడించింది.

Advertisement
Advertisement