రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలి: హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-04T21:25:32+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలి: హైకోర్టు

రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలి: హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. సీజే హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ తమ దృష్టికి వస్తోందని హైకోర్టు పేర్కొంది. 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. అలాగే ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలని హైకోర్టు తెలిపింది. అలాగే రికార్డుల్లోకి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లను కలెక్టర్లు ఆదేశించాలని తెలిపింది. సబ్ రిజిస్ట్రార్లకు అనుమానం వస్తే ముందుగా కలెక్టర్లను సంప్రదించాలని చెప్పింది. ప్రభుత్వ భూముల సర్వే, వివరాల నమోదును కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. 33 జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదికలు సమర్పించాలని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను వారం రోజుల్లో కలెక్టర్లకు పంపించాలని ఏజీకి ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబరు 27కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-08-04T21:25:32+05:30 IST