హెల్మెట్ ధరించకుండా వెనక కూర్చున్న వారికి జరిమానాలపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-08-04T21:20:01+05:30 IST

హెల్మెట్ ధరించకుండా వెనక కూర్చున్న వారికి జరిమానాలపై హైకోర్టులో విచారణ

హెల్మెట్ ధరించకుండా వెనక కూర్చున్న వారికి జరిమానాలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించకుండా వెనక కూర్చున్న వారికి జరిమానాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ పిల్‌పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. మోటారు వాహనాల చట్టం 2019 సవరణలో పిలియన్ రైడర్ ప్రస్తావన ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్ర చట్ట సవరణను రాష్ట్రం స్వీకరించక ముందే పోలీసులు జరిమానా విధిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. వివరాలు తెలుసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. విచారణ సెప్టెంబరు 2కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-08-04T21:20:01+05:30 IST