TS News: మళ్లీ నీట మునిగిన నాగోల్

ABN , First Publish Date - 2022-09-30T14:16:18+05:30 IST

భారీ వర్షాల కారణంగా నగరంలోని నాగోల్ ప్రాంతం మరోసారి నీటమునిగింది.

TS News: మళ్లీ నీట మునిగిన నాగోల్

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా నగరంలోని నాగోల్ ప్రాంతం మరోసారి నీటమునిగింది. అవసరం అయితే తప్ప ఎవ్వరు బయటికి రావొద్దని నాగోల్ ప్రజలకు అధికారులు సూచించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగోల్ చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తుతోంది. అయ్యప్ప కాలనీ, మమతా నగర్ కాలనీ, న్యూ వెంకటరమణ కాలనీ, సాయిరాం నగర్ కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో అయ్యప్ప కాలనీవాసులు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. 

Updated Date - 2022-09-30T14:16:18+05:30 IST